సూరారం గ్రామం 6వ వార్డు నుండి బి. నవీన్ కుమార్ నామినేషన్
సదాశివపేట, నవంబర్ 28 (మన ప్రజాప్రతినిధి)సూరారం గ్రామం 6వ వార్డు నుండి బి. నవీన్ కుమార్ శుక్రవారం నాడు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. జర్నలిస్టు రంగంలో రెండేళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, పరిష్కారానికి కృషి చేసిన నవీన్ కుమార్ ఇప్పుడు ప్రజాసేవకుడిగా ముందుకు సాగాలనినిర్ణయించుకున్నారు.ఎన్నికలప్రచారంలోభాగంగా మాట్లాడుతూ“ప్రజలు ఆశీర్వదిస్తే మా గ్రామ అభివృద్ధిలో ముందంజగా పని చేస్తాను. ముఖ్యంగా ఎస్సీ కాలనీ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను,” అని ఆయన అన్నారు.గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన నవీన్...