manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 December 2025, 12:46 pm Posted by : Mana Praja Prathinidhi

చేగుంట టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షులుగా బాల పోచయ్య ఎన్నిక

ఉపాధ్యాయ ఐక్యతకు బలం: చేగుంట టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడిగా బాల పోచయ్య

మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా,చేగుంట.డిసెంబర్20
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) చేగుంట మండల నూతన కమిటీని మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి. నాగేష్ ఆధ్వర్యంలో ఎన్నిక చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వి.బాల పోచయ్య ను మండల అధ్యక్షులుగా ఎన్నుకోగా,
ఉపాధ్యక్షులుగా కె. మెహన్, గిరిజ,
ప్రధాన కార్యదర్శిగా డి. మణిరామ్,
కోశాధికారిగా వి. శ్రీనివాస్,
కార్యదర్శులుగా రవిబాబు, వి. సురేష్ లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఎన్నికల అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ,టెట్ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని విడనాడాలని,రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని,ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏలను తక్షణమే విడుదలచేయాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం టీఎస్ యూటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు