అందరూ చదివేలా భగవద్గీత సిద్ధం : మల్లెంబాకం మునికృష్ణారెడ్డి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 30పిల్లలు, పెద్దలు, తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ సులభంగా చదివి అర్థం చేసుకునే విధంగా భగవద్గీత సిద్ధంగా ఉందని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భగవంతుని ముఖ పద్మముల నుంచి వెలువడిన దివ్య గ్రంథమైన భగవద్గీతను, వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా, వచన రూపంలో బొమ్మలతో కూడి, హైందవి వారి సౌజన్యంతో తెలుగులో ముద్రించటం జరిగిందని తెలిపారు.విద్యార్థి దశ నుంచే భగవద్గీతను చదవాలి, ఆచరించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేపట్టినట్లు చెప్పారు.ప్రతి గ్రామంలో గీతా...