manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 1:25 pm Posted by : Mana Praja Prathinidhi

జప్తి నాచారంసర్పంచ్అభ్యర్థిగాభవాని నామినేషన్

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.
జప్తి నాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముస్తాల భవాని నేడు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కొండపాకలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి, అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూగ్రామ ప్రజలు తమకు ఆశీర్వాదం అందించి, ఓటు వేసి గెలిపిస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసి, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తానని, అందరూ తమ అమూల్యమైన ఓటును తనకు అప్పగించి సర్పంచిగా గెలిపించాలని కోరారు. గ్రామస్థులు కూడా భవానికి మద్దతుగా నిలుస్తారని ఆమె నమ్మకాన్ని వ్యక్తం చేశారు.