manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 4:14 pm Posted by : Mana Praja Prathinidhi

పోతిరెడ్డిపల్లె గ్రామ పెద్దలకు బైండోవర్ నోటీసులు

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఏసీపీ సదానందం కౌన్సెలింగ్
మనప్రజాప్రతినిధి//హుస్నాబాద్ డిసెంబర్ 7
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతిరెడ్డిపల్లె గ్రామంలోని పెద్ద మనుషులను ఏసీపీ సదానందం కార్యాలయానికి పిలిపించి, ఎన్నికల సమయంలో అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) గురించి కౌన్సెలింగ్ నిర్వహించారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా గ్రామ పెద్దలందరికీ బైండోవర్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఏసీపీ సదానందం స్పష్టం చేశారు.