గ్రామ పాలనలో బీజేపీ ముద్ర… నూతన ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కమలంపార్టీ ఘన సన్మానం
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్21ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామంలో గ్రామ పాలనపై భారతీయ జనతా పార్టీ ప్రభావం మరింత బలపడుతున్నట్లు మరోసారి స్పష్టమైంది. నూతనంగా ఉపసర్పంచ్‌గా ఎన్నికైన తిప్పర వేణి బాలకిషన్తో పాటు, అనంతగిరి గ్రామ వార్డు సభ్యురాలు సిరిసిల్ల అపూర్వ, సిరికొండ గ్రామ వార్డు సభ్యుడు మామిళ్ల రాజులను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించి పార్టీ బలాన్ని చాటారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ…“గ్రామస్థాయి నుంచే బలమైన నాయకత్వాన్ని నిర్మించడమే బీజేపీ లక్ష్యం. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధి,...