ఆదర్శ విద్యానికేతన్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు.

°తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆదర్శ విద్యానికేతన్ హైస్కూల్‌లో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేటనియోజకవర్గం,మనప్రజాప్రతినిధి:ఆగస్టు9ఆదర్శ విద్యానికేతన్ హైస్కూల్‌లో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అలరించారు.పాఠశాల కరస్పాండెంట్ సీహెచ్. సంతోష్ ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ జి. రమాదేవి పర్యవేక్షణలో బోనాల వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ బోనాల పండుగ ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జిలు రజిత,...