manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 11:27 am Posted by : Mana Praja Prathinidhi

తిమ్మనగర్ సర్పంచ్ అభ్యర్థిగా బుడాల నారాయణ నామినేషన్

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్ 4
తిమ్మనగర్ సర్పంచ్ అభ్యర్థిగా బుడాల నారాయణ మెదక్ మండల కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజలు తాను సర్పంచ్‌గా గెలిస్తే తిమ్మనగర్‌ను అన్ని విధాల అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ, “గ్రామ ప్రజల ప్రతి ఒక్కరి సహకారం ఎంతో ముఖ్యం. మీరు నాకు ఓటు వేసి గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కష్టపడతాను” అని తెలిపారు.మనం మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సాయంతో తిమ్మనగర్‌ను అభివృద్ధి బాటలో నడిపిస్తానని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థులకు చేరేలా చేసేందుకు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న తాను, గ్రామ ప్రజలంతా తమ అమూల్యమైన ఓటును వేసి సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.