నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవు-మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ హెచ్చరిక
•న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలుమునిపల్లి,డిసెంబర్30(మనప్రజాప్రతినిధి)డిసెంబర్ 31 న్యూ ఇయర్ సందర్భంగా మునిపల్లి పరిధిలో శాంతిభద్రతలు కాపాడేందుకు కఠిన చర్యలు అమలు చేస్తామని మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ హెచ్చరించారు.డిసెంబర్ 31 రాత్రి ఆర్గనైజ్డ్ కార్యక్రమాలకు పోలీసు అనుమతి లేదని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు తమ ఇండ్లలో కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని సూచించారు. టపాసులు, డీజేలు పూర్తిగా నిషేధించ బడ్డాయని తెలిపారు.మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరమని, వేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. రహదారులను బ్లాక్ చేసి వేడుకలు నిర్వహించడం నిషిద్ధమని...