కోలనూర్ గ్రామ పంచాయతీఆవరణలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 25రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కోలనూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జలగం అరవిందరావు, ఉప సర్పంచ్ బిట్ల బాబు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.ఈ సందర్భంగా పాస్టర్ కొర్నిలే, నిరంజన్ రావు, క్రైస్తవ సంఘ పెద్దలు, గ్రామ సోదరసోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు, మహిళల సమక్షంలో సర్పంచ్‌తో పాటు ప్రజా ప్రతినిధులు క్రిస్మస్ కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు...