అక్బర్‌పేట భూంపల్లి మండల గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు.కూడవెల్లి సర్పంచ్ ఎనగంటి రేణుక కనకరాజు
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లిమండల్,దుబ్బాక నియోజకవర్గం,సిద్దిపేట జిల్లా.డిసెంబర్25అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని కూడవెల్లి గ్రామంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలకు సర్పంచ్ ఎనగంటి రేణుక కనకరాజు శుభాకాంక్షలు తెలిపారు.బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి, ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్ ఎనగంటి రేణుక కనకరాజు మాట్లాడుతూగ్రామస్తుల సహకారంతో కూడవెల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, అక్బర్‌పేట భూంపల్లి మండలంలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా, ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలోని సమస్యలన్నింటిని దశలవారీగా పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన పాలన...