manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 2:45 pm Posted by : Mana Praja Prathinidhi

సూర్య ఎంగేజ్‌మెంట్‌కు సీఎంకు ఆహ్వానం

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన డిప్యూటీ సీఎం
జూబ్లీహిల్స్ నివాసంలో ఆత్మీయ భేటీ
పలువురు మంత్రులను కూడా ఆహ్వానించిన భట్టి విక్రమార్క దంపతులు

హైదరాబాద్, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
తనయుడు సూర్య ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం ఈ నెల 26న జరగనున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని భట్టి విక్రమార్క–నీలిమ దంపతులు కోరారు. ఈ సందర్భంగా సమావేశం పూర్తిగా ఆత్మీయ వాతావరణంలో సాగింది. కుటుంబ కార్యక్రమం నేపధ్యంలో జరిగిన ఈ ముఖాముఖీ భేటీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది.
భట్టి విక్రమార్క దంపతులు సీఎం తో పాటు పలువురు కీలక మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండ సురేఖ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు కూడా వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రాలు అందజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.