ఆచూకీ లేని మత్స్యకారులపై ఆందోళన

ఎనిమిది మంది కోసం గాలింపుకోస్ట్‌గార్డ్‌తో ముమ్మర చర్యలుకుటుంబాల్లో పెరుగుతున్న ఉత్కంఠకోనసీమ, ఆగస్టు 17 (మనప్రజాప్రతినిధి): చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కోనసీమ జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన ఒక బోటులో ఈ నెల 3న మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లగా, నిర్ణీత గడువు ముగిసినా వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడం కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు, మత్స్యకార సంఘాలు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....