manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 4:48 am Posted by : Mana Praja Prathinidhi

ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

•మైనర్ కావడంతో పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణ

– పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివారులో విషాదం

మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి10.సిద్దిపేటనియోజకవర్గం.

•సిద్ధిపేట జిల్లా రూరల్ మండలపరిధిలో ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో యువజంట ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం నారాయణరావుపేటకు చెందిన మాదన్న గారి శ్రావణ్(24) వృత్తి రీత్యా బైండ్ల పని వ్యవసాయం చేసే వారు పెద్దకోడూరుకు చెందిన బోనాల నవ్యశ్రీ (17) వరుసకు బావ–మరదళ్లు అవుతారు. నవ్యశ్రీ ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉండగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా రు.అయితే నవ్యశ్రీ మైనర్ కావడం, అలాగే ఆమె అక్కకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుటుంబ సభ్యులు వారి వివాహానికి నిరాకరించారు. ఈ విషయంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ సోమవారం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ చివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు