ప్రేమ ముసుగులో పెరుగుతున్న నేరాలు<br>
పెళ్లి హామీలు..మోసాలు..చివరకు హత్యలుయువతుల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనఅప్రమత్తతే ప్రాణాలను కాపాడే మార్గంఆగస్టు17(మనప్రజాప్రతినిధి): ప్రేమ, వివాహం పేరుతో యువతులను నమ్మించి మోసగించడం, శారీరకంగా మరియు మానసికంగా వేధించడం, చివరకు హత్యలకు పాల్పడటం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో యువతిని హత్య చేసి గోనె సంచిలో తరలించే ప్రయత్నం చేసిన ఘటన మరోసారి ఇలాంటి నేరాల తీవ్రతను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రేమ పేరుతో ప్రారంభమైన సంబంధాలు కొన్నిసార్లు దారుణ నేరాలకు దారితీయడం సమాజాన్ని కలవరపెడుతోంది. గత కొన్నేళ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రేమ,...