తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శిగా దేవని శేఖర్ నియామకం
మనప్రజాప్రతినిధి//హైదరాబాద్, ఆగస్టు 3 తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శిగా దేవని శేఖర్ను రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ అధికారికంగా నియమించారు. ఈ నియామకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ దేవని శేఖర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా దేవని శేఖర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు...