స్నేహపూర్వక పోటీతత్వంతోమెలగాలిడీఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి

పాపన్నపేట,డిసెంబర్5(మనప్రజాప్రతినిధి)రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఓటరు, అభ్యర్థి స్నేహపూర్వకంగా వ్యవహరించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ గైను సమీపంలో స్థానిక ఎన్నికలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడారు.ఎన్నికలు ఐదేళ్లకోసారి జరిగే ప్రజాస్వామ్య పండుగ అని, గొడవలు సృష్టించడం, నియమావళిని అతిక్రమించడం వంటివి కఠిన చర్యలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. సాధారణ కేసుల కంటే ఎన్నికల సమయంలో నమోదు అయ్యే కేసులు తీవ్రమైనవని, అలాంటి...