కాలేశ్వరం కెనాల్ పనులు పూర్తి చేయాలని రైతుల మోకాళ్లపై నిరసన దీక్ష

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.ఫిబ్రవరి22మనకొండూరు మండలంలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. కాలేశ్వరం 11వ ప్యాకేజ్ ఆర్డీ-3, ఎల్‌ఎం-6 కాల్వ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.గతంలో 19 రోజుల పాటు దీక్షలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి 13 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా ఎలాంటి చలనం కనిపించడంలేదని తెలిపారు.“మిమ్మల్ని ఓటు వేసి గెలిపించినందుకు మేమే మోకాళ్లపై కూర్చొని శిక్ష వేసుకుంటున్నాం” అంటూ రైతులు మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు....