manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 3:12 am Posted by : Mana Praja Prathinidhi

గ్రామాలలోఓటర్లకువిందుఏర్పాటుత్రీటౌన్ పోలీస్ స్టేషన్లోకేసులు నమోదు

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్8
కొండపాక మండలంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు విందులు ఏర్పాటు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమాచారాన్ని వెంటనే పరిశీలించిన మండల ఫ్లయింగ్ స్కాడ్ టీం, సంబంధిత అభ్యర్థులపై అధికారిక ఫిర్యాదులు నమోదు చేసింది.ఖమ్మంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులైన మంద భాస్కర్ రెడ్డి మరియు కర్ణాకర్ తమ వ్యవసాయ భూమిలో ఓటర్లకు భోజన విందు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఫ్లయింగ్ స్కాడ్ ఇంచార్జ్ చెట్లపల్లి బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.అదే విధంగా అంకిరెడ్డిపల్లి గ్రామంలో పదో వార్డు సభ్య అభ్యర్థి తాళ్లపల్లి చందన్, తన వార్డు ఓటర్లలో 12 మంది కులస్తులకు ఎల్లమ్మగుడి వద్ద మద్యం విందు ఏర్పాటు చేసినట్టు ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని ధృవీకరించిన ఫ్లయింగ్ స్కాడ్ టీం, సంబంధితులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ పోలీసులకు నివేదిక అందించింది.ఈ రెండు ఘటనల్లో పాల్గొన్న అభ్యర్థులు, వారికి సహకరించిన వ్యక్తులపై 3 టౌన్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో కేసులు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘ నపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంచేశారు.