ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలి

–ఇన్స్పెక్టర్ వెంకటేష్సదాశివపేట,జనవరి14(మనప్రజాప్రతినిధి)సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.రోడ్లపై ద్విచక్ర వాహనాలు నడిపే యువత తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణం చేయరాదని అన్నారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడటం, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేయడం, సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని...