వడ్డీ రేట్లపై గవర్నర్‌ కీలక సంకేతాలు..

ముంబై, నవంబర్‌, 25,మనప్రజాప్రతినిధి:దేశవ్యాప్తంగా లక్షలాది మంది రుణగ్రహీతలకు త్వరలోనే ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలు ఉన్నాయని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఓ ప్రముఖ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలోనే భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోతపై సంకేతాలు ఇచ్చామని, ఆ తర్వాత వెలువడిన ఆర్థిక గణాంకాలు కూడా సానుకూల దిశగా ఉన్నాయని తెలిపారు.ప్రస్తుతం దేశంలో రిటైల్...