ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు

వెంకటపాలెంలో నేతల నివాళి కార్యక్రమంపాల్గొన్న నారా లోకేష్, మంత్రులుఅసెంబ్లీకి బయలుదేరిన ప్రజాప్రతినిధులుపెద్ద సంఖ్యలో హాజరైన రైతులుఅమరావతి,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడిగా ఎన్టీఆర్‌ను కొనియాడారు....