జాతీయ జెండాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.
"దేశభక్తి నినాదాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాలీసిద్దిపేటనియోజకవర్గం//మనప్రజాప్రతినిధి:అగస్టు12 హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్), సిద్దిపేట ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి సిద్దిపేట బస్టాండ్ వరకు విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తిని పెంపొందించే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తిని చాటుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. “హర్ ఘర్ తిరంగా–ప్రతి ఇంటిపై జాతీయ జెండా”, “దేశభక్తిని చాటుదాం–జాతీయ...