ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వెల్నెస్ హాస్పిటల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి
సిపిఐ పార్టీ డిమాండ్సంగారెడ్డి,డిసెంబర్23(మనప్రజాప్రతినిధి)ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంగారెడ్డి చౌరస్తాలోని వెల్నెస్ ప్రైవేట్ ఆసుపత్రిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏవో ఆంథోనీ డయాన్సీయో గారికి సిపిఐ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.ఏ. రెహమాన్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులు 24 గంటల సేవలు అందిస్తామని ప్రజలను నమ్మించి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన రోగుల నుండి టెస్టుల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్ పేరుతో లక్షల రూపాయలు...