మనప్రజాప్రతినిధి tv కథనానికి తక్షణమే స్పందన లంచం ఆరోపణలపై ఈసీని సస్పెండ్ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్
మనప్రజాప్రతినిధి//సూర్యాపేట జిల్లా, ఆగస్టు018 సూర్యాపేట జిల్లా, నాగారం: ఉపాధి హామీ పథకం పనుల్లో లబ్ధిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సూర్యాపేట జిల్లాలో కలకలం రేపాయి. నాగారం మండలం శాంతినగర్ గ్రామంలో పశువుల కొట్టాలు, కోళ్ల ఫారం షెడ్ల మంజూరు వ్యవహారంలో లంచం డిమాండ్ చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ)పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.లబ్ధిదారుల వివరాల ప్రకారం.. శాంతినగర్ గ్రామానికి తొమ్మిది పశువుల కొట్టాలు, ఒక కోళ్ల ఫారం షెడ్డు మంజూరయ్యాయి. అయితే పశువుల కొట్టాలకు రూ.5 వేల...