సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఆయుధమా? లేక కొందరి చేతుల్లో వ్యాపార సాధనమా?
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట, జూన్ 13:ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం 2005లో తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం (రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ -RTI) దేశ చరిత్రలో ఒక మైలురాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఈ చట్టం సామాన్య పౌరుడికి రాజ్యాంగబద్ధమైన అస్త్రంగా మారింది.ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కినా సమాచారం దొరకని పరిస్థితి ఉండేది. కానీ ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అటెండర్ నుండి కలెక్టర్ వరకు,...