నేడే పాపన్నపేటలో జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ – జిల్లా వ్యాప్తంగా ఆసక్తి పెరిగిన క్రీడాకారులు

పాపన్నపేట,నవంబర్29:(మనప్రజాప్రతినిధి) మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో ఈ నెల 30న జూనియర్ బాలబాలికల కోసం కబడ్డి ఎంపిక పరీక్షలు నిర్వహించబోతున్నాయి. ఈ అవకాశానికి మెదక్ జిల్లాక్రిడాకారులుఆసక్తిగాఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా కబడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సెలక్షన్‌లను జిల్లా కబడ్డి అసోసియేషన్ ప్రధానకార్యదర్శిపోల్కంపేటరమేష్ అధికారికంగా ప్రకటించారు.ఈ ఎంపికల్లో మెదక్ జిల్లా ప్రతిభావంతులైన యువ కబడ్డి క్రీడాకారులు పొద్దున్నపోగా రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరచేందుకు సన్నాహాలు అవుతాయన్నారు.20సంవత్సరాలలోపు బాలురు, బాలికలు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని వివరింపబడింది. క్రీడా శైలి, శారీరక నైపుణ్యం, చురుకుదనం,...