నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగింత
ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్‌గా నియామకంకేబినెట్ హోదాతో అధికారిక ఉత్తర్వులుపర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టిరాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపే లక్ష్యం... అమరావతి,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నాగబాబుకు కేబినెట్ హోదా కూడా కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం విస్తరణ, అటవీ సంపద అభివృద్ధి లక్ష్యంగా...