manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 11:44 am Posted by : Mana Praja Prathinidhi

ఏపీఉపముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన కొట్టే సాయి ప్రసాద్

మనప్రజాప్రతినిధి//రేణిగుంటమండలం.డిసెంబర్4
చిత్తూరులో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 నూతన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు.                  ఈసందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాగత కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి చిత్తూరు వైపు బయలుదేరగా, ఆయనను చూడటానికి జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.