ఏర్పేడు మండలంలో భూకబ్జాదారుల రాజ్యం!
•నకిలీ అగ్రిమెంట్లతో డీకేటీ భూముల స్వాధీనం యత్నం•పంటలు ధ్వంసం…రైతులకు ప్రాణహాని బెదిరింపులు•పట్టాలు ఉన్నా భయాందోళనలో రైతులు•డీకేటీ భూములపై దాడులు-రైతుల ప్రాణాలకు ముప్పుమనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి23తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో భూకబ్జాదారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రభుత్వం పేద రైతులకు కేటాయించిన డీకేటీ భూములను లక్ష్యంగా చేసుకుని కొంతమంది అక్రమదారులు రోజుకో రూపంలో రైతులపై దాడులకు దిగుతూ మండలంలో భయాందోళన సృష్టిస్తున్నారు.భూమి అసలు యజమాని సాగు చేస్తూ భూమిలో ఉన్నప్పటికీ, నకిలీ అగ్రిమెంట్లతో తమకే హక్కులున్నాయని చెప్పుకుంటూ రైతులను చంపేస్తామని బెదిరించడం, పంటలను నాశనం చేయడం...