మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు-ఆర్థిక సహాయం అందజేసిన దేవేందర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి21కొండపాక మండలంలోని వెలికట్ట గ్రామ మాజీ సర్పంచ్ అమ్ముల రమేష్ బాబు భార్య శిరీష గత మూడు సంవత్సరాలుగా అనారో గ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం సిద్ధిపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి వెలికట్ట గ్రామానికి చేరుకొని, మాజీ సర్పంచ్ రమేష్ బాబు భార్య మృతదేహానికి పూలదండ వేసి నివాళుల ర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ...