నూతన సంవత్సర వేడుకల్లో శాంతి భద్రతలే లక్ష్యం: మొగుడంపల్లి ఎస్‌ఐ.
సంగారెడ్డి,డిసెంబర్30(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని చిరాగ్‌పల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే. రాజేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు.డిసెంబర్ 29న ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు హైవేలపై, ప్రధాన రహదారులపై కేక్ కటింగ్ చేయరాదని స్పష్టం చేశారు.హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వాహకులు తప్పనిసరిగా నిర్దేశిత సమయపాలన పాటించాలని సూచించారు. ఈవెంట్లలో డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత...