manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 4:55 pm Posted by : Mana Praja Prathinidhi

సంతోషాలకు నెలవైన మకర సంక్రాంతి పండుగ

జిల్లాకాంగ్రెస్ నాయకులుబుడ్డ భాగ్యరాజ్ ఆకాంక్ష
మెదక్ జిల్లా,చేగుంట.జనవరి14(మనప్రజాప్రతినిధి)
మెదక్ జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీకగా, రైతులపండుగగా, సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కష్టపడి పండించిన పసిడి పంటలతో రైతులు ఆనందంగా ఈ పండుగను జరుపుకోవడం మన సంప్రదాయమని చెప్పారు.
సకల సంపదలతో ప్రతి కుటుంబం కలిసి ఐక్యతతో, ఆనందోత్సాహా లతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, కొత్త వెలుగులు నింపాలని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో, సుభిక్షంగా జీవించాలని కోరారు.ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పశుపోషణతో అనుబంధమైన భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గ్రామ జీవనానికి ప్రాణమని తెలిపారు. భోగి పండుగ ద్వారా పాత బాధలు, కష్టాలు దహనం అయి, నూతన ఆలోచనలు, ఆశలు పుడతాయని అన్నారు.పసిడి పంటలతో గ్రామాలు కళకళలాడాలని, రైతుల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరియాలని, ఈ భోగి పండుగ ప్రతి ఇంటికి భోగభాగ్యాలు ప్రసాదించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ఆకాంక్షించారు.