సంతోషాలకు నెలవైన మకర సంక్రాంతి పండుగ

•జిల్లాకాంగ్రెస్ నాయకులుబుడ్డ భాగ్యరాజ్ ఆకాంక్షమెదక్ జిల్లా,చేగుంట.జనవరి14(మనప్రజాప్రతినిధి)మెదక్ జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీకగా, రైతులపండుగగా, సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కష్టపడి పండించిన పసిడి పంటలతో రైతులు ఆనందంగా ఈ పండుగను జరుపుకోవడం మన సంప్రదాయమని చెప్పారు.సకల సంపదలతో ప్రతి కుటుంబం కలిసి ఐక్యతతో, ఆనందోత్సాహా లతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు....