“గ్రామ శాఖ బిఆర్ఎస్ అధ్యక్షులు మారెడ్డిలింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
°కేక్ కటింగ్‌తో సందడి..భారీగా పాల్గొన్న నాయకులు.అభిమానులు
°జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం..
°రక్తదానం.. అన్నదానం..కేక్ కటింగ్ ఘనంగా రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం:ఆగస్టు15.
సిద్దిపేటజిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు గ్రామంలో మాజీ సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు మారెడ్డి లింగారెడ్డి.బొప్పిడిశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం చేపట్టడంతో పాటు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మారెడ్డి రవీందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని, అన్నదాన కార్యక్రమం ద్వారా సేవా స్ఫూర్తిని చాటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడిరాజవ్వ,వార్డుసభ్యులు బొర్రశేఖర్,బందారం పర్షరాములు,ఎండీసల్మాన్,కత్తి శ్రీనివాస్ గౌడ్,గోపాల శ్రావణ్. ఘణపురం రమేష్.వాసూరిశేఖర్.బండిశ్రీనివాస్.చేశారు.రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మారెడ్డి మధుసూదన్ రెడ్డి.బొప్పిడి శ్రీనివాస్ రెడ్డివాసూరి స్వామి,ముఖ్య సలహాదారులు చల్లాఎల్లారెడ్డి,చల్లా విజయ్ కుమార్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,కుంభంసురేష్ రెడ్డి, మన్నెకుమారస్వామి,నరేందర్ రెడ్డి, బాల్రెడ్డి,చిట్యాల సత్యనారాయణ గౌడ్, చంద్రమోహన్ రెడ్డి. కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేసారు.