పాలనలోనే కాదు… క్రీడల్లోనూ నాయకత్వం చూపిన ఎమ్మెల్యే బొజ్జల

•ప్రజలతో మమేకమైన నాయకుడు… క్రికెట్ మైదానంలోకి దిగిన ఎమ్మెల్యే బొజ్జలశ్రీకాళహస్తి,జనవరి10(మనప్రజాప్రతినిధి):శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాలనలోనే కాదు… క్రీడల్లోనూ నాయకత్వం చాటారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్) ప్రాంగణంలో నిర్వహించిన బొజ్జల క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ 2ను ఆయన ఘనంగా ప్రారంభించారు.ఈ టోర్నమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ప్రత్యక్ష పాల్గొనడం. తానే స్వయంగా మైదానంలోకి దిగి బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ యువతను...