స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన నేతాజీ సేవలు చిరస్మరణీయం: సర్పంచ్ మామిడి రాజు

•నేటి యువతకు జ్వలంత స్ఫూర్తి నేతాజీసుభాష్ చంద్రబోస్:సర్పంచ్ మామిడి రాజు మనప్రజాప్రతినిధి,//మానకొండూర్.జనవరి23ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మామిడి రాజు ఆధ్వర్యంలో, పాలకవర్గం సహకారంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి నేటి...