న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి
•డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు•నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ "మహేష్ బి. గితే, ఐపీఎస్మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 29నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్ గారు సూచించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా డ్రంక్...