manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 12:32 pm Posted by : Mana Praja Prathinidhi

దివ్యాంగుల సంక్షేమమే మా లక్ష్యంవెలుగు మండల సమైక్య

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్9
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ మండలంలోని భవితనైబర్ హుడ్ కామన్ సెంటర్‌లో వెలుగు మండల సమైక్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని సందడిగా, సార్థకంగా నిర్వహించారు.జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు, సీఎంవో రాజు గారు ప్రత్యేక అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవవంతం చేశారు.డిపిఎం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ “మండల పరిధిలో ఉన్న ఒక సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల వయస్సు గల ప్రతి దివ్యాంగుడు గ్రామ సంఘాలలో తప్పనిసరిగా చేరాలి. వారికోసం గ్రామ సంఘాల్లో ప్రత్యేక పదవులు కేటాయించాం. బ్యాంకు రుణాల సాయంతో చాలా మంది దివ్యాంగులు తమ జీవనోపాధిని విజయవంతంగా నిర్మించుకుంటున్నారు” అని పేర్కొన్నారు.సీఎంవో రాజు గారు మాట్లాడుతూ“6 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు గల దివ్యాంగుల కోసం సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయించే పథకాలు అమలులో ఉన్నాయి. విద్య వారికి భవిష్యత్తుకు మార్గదర్శి అవుతుంది” అని తెలిపారు.కార్యక్రమంలో బ్యాంకు సహకారంతో జీవనోపాధి పొందుతున్న దివ్యాంగులను ఘనంగా సన్మానించారు. సెంటర్‌కు సేవలందిస్తున్న సిబ్బందిని కూడా అభినందించి సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఏపిఎం ఎం. నాగరాజు, ప్రొఫెషన్స్ అన్నారావు, సుభాష్, స్వప్న, సీసీలు శ్రీనివాస్, మహాలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ఐఆర్పి శ్రీనివాసచలం, నైబర్ సెంటర్ సిబ్బంది మంజుల, యాదమ్మ, రామలక్ష్మి, అకౌంటెంట్ మాధవి, కంప్యూటర్ ఆపరేటర్ అరవింద్ కుమార్, దివ్యాంగ పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.