దివ్యాంగుల సంక్షేమమే మా లక్ష్యంవెలుగు మండల సమైక్య
మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్9అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ మండలంలోని భవితనైబర్ హుడ్ కామన్ సెంటర్‌లో వెలుగు మండల సమైక్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని సందడిగా, సార్థకంగా నిర్వహించారు.జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు, సీఎంవో రాజు గారు ప్రత్యేక అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవవంతం చేశారు.డిపిఎం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ “మండల పరిధిలో ఉన్న ఒక సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల వయస్సు గల ప్రతి దివ్యాంగుడు గ్రామ సంఘాలలో తప్పనిసరిగా చేరాలి. వారికోసం గ్రామ సంఘాల్లో ప్రత్యేక పదవులు కేటాయించాం. బ్యాంకు రుణాల...