ప్రయాణికుల భద్రతే లక్ష్యం – రోడ్డు భద్రతపై సీఐ వెంకటేష్ సూచనలు

•మద్యం సేవించి వాహనం నడపొద్దు-డ్రైవర్లకు సీఐ హెచ్చరిక •ఆటో,లారీ డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి– సీఐ వెంకటేష్సదాశివపేట,జనవరి20(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సదాశివపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో, లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు, రహదారి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సదాశివపేట సీఐ వెంకటేష్ మాట్లాడుతూ, డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనాలను అత్యంత జాగ్రత్తగా నడిపి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం...