manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 11:37 am Posted by : Mana Praja Prathinidhi

జంగపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పాతూరి లావణ్య నర్సింహారెడ్డి నామినేషన్.

మనప్రజాప్రతినిధి //అక్బర్ పేట్.భూంపల్లి మండలం,
సిద్దిపేట జిల్లా.డిసెంబర్ 2
జంగపల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న పాతూరి లావణ్య నర్సింహారెడ్డి తమ నామినేషన్ పత్రాలను మంగళవారం రుద్రారం గ్రామపంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు. ప్రముఖ సంఘసేవకుడు పాతూరి బాల్‌రెడ్డి నేతృత్వంలో ఆమెను బలపరిచిన స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పాతూరి లావణ్య నర్సింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ఇప్పటికే చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని, వాటి ఆధారంగా తనకు భారీ మెజార్టీ లభిస్తుందనే నమ్మకమున్నదని తెలిపారు. జంగపల్లిని రాష్ట్రంలోనే నెంబ‌ర్ వ‌న్ గ్రామపంచాయతీగాతీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
దుబ్బాక నియోజకవర్గం సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని, గ్రామంలో ఉన్న అన్ని ప్రధాన సమస్యలను ఏడాదిలోపే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఈకార్యక్రమంలో బిక్షపతి రాములు, బాల్‌రెడ్డి, పురుషోత్తం, రమేష్, రాజు, జ్యోతిబాబు, పొలాబోయిన నాగరాజు, వంజరి సాయిరాం, వంజరి నాగరాజు, లాలు గౌడ్, రామగాళ్ల స్వామి, పోలీస్ స్వామి, మల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.