భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
"అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు – ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జూలై30:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు, యువకులు...