నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ఏర్పాటు - ఓవర్‌లోడింగ్, ఓవర్‌స్పీడ్ వాహనాలపై సీజ్ ఆదేశాలు - ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, ట్రాక్టర్లపై వేధింపులు చేయవద్దని ఆదేశం - రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ (హైదరాబాద్, నవంబర్ 12) (మనప్రజాప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లా స్థాయిలో 33 ఎన్‌ఫోర్స్‌మెంట్...