ప్రజల పాలనకు ప్రజా మద్దతు.నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్25కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మిద్దె శివకుమార్, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి, వార్డు మెంబర్ కొమ్ము కవిత స్వామికి మాదిగ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పల్లె భూపతి రాజు మాట్లాడుతూ, ప్రజల ఆశయాలతో అధికారంలోకి వచ్చిన నూతన ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని పాలన సాగించాలని సూచించారు. ప్రతి వర్గానికీ సమ న్యాయం అందేలా పనిచేసి, మౌలిక వసతుల కల్పనతో పాటు పేద,...