“ఇక ప్రతిసోమవారం మండల కేంద్రంలోనే ఫిర్యాదుల స్వీకరణ
°జిల్లాకేంద్రానికివెళ్లేఅవసరంలేదు..మండలంలోనేఅధికారులసమక్షంలో సమస్యలకు పరిష్కారం
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఆగస్టు15
ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. ఇకపై ప్రతి సోమవారం కొండపాక ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు.
మండల పరిధిలోని 23 లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించనున్నారు. ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ ఫిర్యాదులను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.
దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను జిల్లా కేంద్రానికి వెళ్లకుండానే మండల కేంద్రంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది. సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు