manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 2:45 pm Posted by : Mana Praja Prathinidhi

సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు-గ్రామ సర్పంచ్ ఓగ్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహణ

సదాశివపేట,జనవరి13(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను గ్రామ సర్పంచ్ ఓగ్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీసీ సెల్ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ దుర్గం బోయిని కృష్ణ సహాయ సహకారాలు అందించారు.ముగ్గుల పోటీలకు గ్రామ మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, సీఐ వెంకటేశం, ఎమ్మార్వో బాలరాజు, ఆర్ఐ గంగాధర్, ఆలయ అర్చకులు విజయసారథి, అఖిలేష్ పాండే స్వామి హాజరై పాల్గొన్నారు.
అలాగే ఉప సర్పంచ్ మహేందర్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం, వార్డ్ మెంబర్లు ఓ. సునీత, డి. కుమార్, డి. కల్పన, పి. శ్రీనివాస రెడ్డి, పి. వెంకటేశం, డి. పోచన్న, జి. లక్ష్మణ్, ఎం. సురేష్, జంజిరాల విజయ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.