మాజీ ఎంపీటీసీ కుటుంబానికి రసమయి బాలకిషన్ హృదయపూర్వక పరామర్శ”కేషవేని రాజేశం చిత్రపటం వద్ద కన్నీటి నివాళులు

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 23ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కేషవేని రాజేశం ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం గాలిపల్లి గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ విషాద సమయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.రాజేశం చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన రసమయి బాలకిషన్, ఆయనతో గడిపిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాజేశం ప్రజల మధ్య జీవించిన నాయకుడని, నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి అని...