విశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్య సేవలకు ఘన గుర్తింపు..
•రక్తదానం నుంచి బాల కార్మికుల పునరావాసం వరకు… విలువలతో కూడిన విద్యకు అంకితమైన సేవలకు బ్రహ్మకుమారి సంస్థ ఘనసత్కారం.సదాశివపేట,జనవరి19(మనప్రజాప్రతినిధి)సంగారెడ్డి జిల్లా విశ్రాంత మండల విద్యాధికారి డి. అంజయ్య చేసిన విశిష్ట సేవలకు రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబూలోని బ్రహ్మకుమారి సంస్థ ఘనంగా గుర్తింపు ప్రకటించింది. బ్రహ్మకుమారి సంస్థ నిర్వహించిన ఆధ్యాత్మిక రాజయోగ సమ్మేళనంలో ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.డి.అంజయ్య 47 సార్లు రక్తదానం చేయడం, సుమారు 800 మంది బాల కార్మికులను గుర్తించి బడిబాట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, ఎన్.సి.సి. అధికారిగా విద్యార్థుల్లో క్రమశిక్షణ,...