కల్తీ నెయ్యిపై సజ్జనార్ హెచ్చరిక
ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దుభారీగా కల్తీ నెయ్యి స్వాధీనంవినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచనహైదరాబాద్,ఆగస్టు19(మనప్రజాప్రతినిధి): ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే కల్తీ ఆహార వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) చేపట్టిన భారీ దాడులను ప్రస్తావిస్తూ ఆయన స్పందించారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 130 సంస్థలను పరిశీలించగా, 39 తయారీ...